విజయ్ .. విక్రమ్ లతో శంకర్ భారీ మల్టీ స్టారర్
- భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్
- ముందుకు కదలని 'భారతీయుడు 2' ప్రాజెక్టు
- ఆగిపోయిందంటూ జోరుగా ప్రచారం
ఆ వార్తలకి బలాన్ని చేకూరుస్తూ ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాను లైన్లో పెట్టడానికి శంకర్ ప్రయత్నాలు ప్రారంభించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఆయన విజయ్ .. విక్రమ్ లతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా చెబుతున్నారు. నిజానికి ఇది 'భారతీయుడు 2' తరువాత చేద్దామని శంకర్ అనుకున్న ప్రాజెక్టు అనీ, ఆ ప్రాజెక్టు ఆగిపోవడం వల్లనే శంకర్ ఈ కథను బయటికి తీశాడని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.