ఏపీ వైద్య కళాశాలలో 190 సీట్ల పెంపు
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో అదనపు సీట్లు కేటాయింపు
- రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్ కళాశాలు
- సౌకర్యాలను బట్టి ఆయా కళాశాలలకు సీట్ల సర్దుబాటు
ఏపీలో మొత్తం 12 వైద్య కళాశాలలుండగా ఆరు కళాశాలల్లో 200 చొప్పున, మూడు కళాశాలల్లో 150 సీట్లు చొప్పున, మరో మూడు కళాశాలల్లో 100 సీట్లు చొప్పున ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఉన్న సదుపాయాలు, వసతుల ఆధారంగా కొత్తగా కేటాయించిన సీట్లను ఆయా కళాశాలలకు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ నెల 15లోగా పంపాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాలేజీలకు లేఖ రాసింది.