ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని థియేటర్లలోంచి తీసేశారు: వర్మ
- సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కూడా ఇచ్చింది
- హైకోర్టూ సరేనంది
- శాంతిభద్రతల సమస్యలు వస్తాయంటున్నారు
శాంతిభద్రతల సమస్య వస్తుందని అధికారులు చెబుతుండడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలోని థియేటర్ల నుంచి తొలగించినట్టు వర్మ ట్వీట్ చేశారు. "సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది, హైకోర్టు కూడా సరేనంది. అలాంటప్పుడు ఏం శాంతిభద్రతల సమస్యలు వస్తాయనుకుంటున్నారో నా సినిమా విడుదలను అడ్డుకుంటున్న శక్తులను అడగాలనుకుంటున్నా!" అని పేర్కొన్నారు.