ముస్లిం మహిళల బుర్ఖాలతో జాతీయ భద్రతకు ముప్పు... శ్రీలంకలా నిర్ణయం తీసుకోవాలని శివసేన డిమాండ్!
- శ్రీలంకలో బుర్ఖాలపై నిషేధం
- మోదీ ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి
- దేశ ప్రజల భద్రతకోసమేనన్న శివసేన
ఇదే సమయంలో బుర్ఖాను నిషేధించే నిర్ణయం తీసుకోవాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై సర్జికల్ దాడికి వెళ్లినప్పుడు చూపినంత గుండెధైర్యాన్ని మోదీ చూపాల్సి వుంటుందని వెల్లడించింది. అయితే, ఈ నిర్ణయం అసాధ్యమైనదేమీ కాదని, కొంత ధైర్యంగా వ్యవహరిస్తే, ప్రజలు సైతం బుర్ఖా నిషేధాన్ని హర్షిస్తారని పేర్కొంది. జాతి భద్రతకు విఘాతంగా మారిన వారు తమను గుర్తు పట్టకుండా బుర్ఖా మాటున దాగే అవకాశాలు పుష్కలమని, ఆ అవకాశం వారికి లేకుండా చేస్తే, దాడులు తగ్గుతాయని తెలిపింది. దేశ ప్రజల భద్రత కోసం మోదీ ధైర్యాన్ని ప్రదర్శించాలని 'సామ్నా' తన సంపాదకీయంలో సూచించింది.