దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు లేఖ రాసిన ద్వివేది
- దేశంలో పొలిటికల్ బయోపిక్ లపై ఈసీ నిషేధం ఉంది
- కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందే
- వర్మ ఆశలపై నీళ్లు చల్లిన ద్వివేది
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో అన్ని పొలిటికల్ బయోపిక్ లను నిషేధిస్తూ ఏప్రిల్ 10న ఆదేశాలు జారీచేసిందని, ఈసీఐ ఆదేశాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని ద్వివేది తన లేఖలో పేర్కొన్నారు. తాజాగా ద్వివేది లేఖ రాసిన నేపథ్యంలో వర్మకు ఇది నిరుత్సాహం కలిగించే విషయం అని చెప్పాలి.