lakshmis ntr: 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు రేపు ముహూర్తం పెట్టుకున్న వర్మ.. విడుదలపై ఉత్కంఠ

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రేపు (మే1) విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే సినిమా విడుదలకు వారు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి చిత్రాలు విడుదల చేయవద్దని ఈ నెల 10న ఈసీ ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికలపై ప్రభావం చూపే బయోపిక్ లను ప్రదర్శించరాదని ఈ ఆదేశాల్లో ఉంది. తమ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మరో ఉత్తర్వును విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో, కోడ్ అమల్లో ఉండే మే 23 వరకు ఈ సినిమాను విడుదల చేయడం కుదరదు. ఈ క్రమంలో, సినిమా విడుదలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
lakshmis ntr
ap
release

More Telugu News