యువకుడి ప్రాణం తీసిన మితిమీరిన వ్యాయామం!

  • వ్యాయామం చేస్తూ కుప్పకూలిన ఆదిత్య
  • టాబ్లెట్‌ను ఇచ్చిన జిమ్ నిర్వాహకులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 
హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో దారుణం జరిగింది. స్థానిక గోల్డెన్ జిమ్‌లో మితి మీరిన వ్యాయామం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆదిత్య అనే యువకుడు నేడు జిమ్‌లో అధిక వ్యాయామం చేశాడు. దీంతో అతనికి ఛాతి నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. వెంటనే జిమ్ నిర్వాహకులు అతనికి ఓ టాబ్లెట్‌ను ఇచ్చారు. అది వేసుకున్న అనంతరం ఆదిత్య పరిస్థితి మరింత విషమించింది. వెంటనే అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదిత్య మరణించాడు.
Go Back to Shorts
Aditya
Hyderabad
Golden jim
SR Nagar
Died
Tablet

More Telugu News