ఆంధ్రాకు రావాలంటే మేం వీసా తీసుకోవాలా? నేరచరిత్ర లేదని ప్రూవ్ చేసుకోవాలా?: రామ్ గోపాల్ వర్మ
- ఏపీని పోలీస్ రాజ్యంగా మార్చేశారు
- రాష్ట్రంలో ప్రెస్మీట్ కు వీలు లేదంటున్నారు
- హైదరాబాద్ లో మీడియాతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శకుడు
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు. మనదేశంలోని ఓ రాష్ట్రంలో మీడియా సమావేశం పెట్టుకునేందుకు కూడా స్వేచ్ఛ లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వచ్చే నెల 1న ఏపీలో విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అందరూ చూడాలని వర్మ ఈ సందర్భంగా కోరారు.