ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు!: మమతా బెనర్జీ
- గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఓట్లు చీలుతాయి
- దేశానికి అతిపెద్ద ముప్పు బీజేపీనే
- మోదీ రెండోసారి అధికారంలోకి వస్తే నాశనం చేస్తారు
అంతేకాకుండా 440 వోల్టుల విద్యుత్ ఎంత ప్రమాదకరమో, బీజేపీ కూడా అంతే ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. బీజేపీ దేశానికి అతిపెద్ద ముప్పు అని అభివర్ణించారు. అందుకే ప్రజలు ఆ పార్టీకి దూరంగా ఉండాలని, పొరబాటున కూడా ఆ పార్టీకి మద్దతుగా ఓటేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం దేశానికి ఎలాంటి నష్టం ఉండదని, ఆ మేరకు తాను హామీ ఇస్తానని అన్నారు.
హుగ్లీ జిల్లాలోని పండువాలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మమత మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. "బీజేపీ, మోదీ రెండోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఆ పార్టీ నిండా నిరక్షరాస్యులే. వాళ్ల నుంచి మనం ఏం ఆశిస్తాం చెప్పండి!" అంటూ విమర్శించారు.