Telangana: తెలుగు ప్రజల కోసం పార్టీలు పెట్టి విజయం సాధించిన నాయకులు ఆ ఇద్దరే: కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు ప్రజల కోసం పార్టీలు పెట్టి విజయం సాధించిన నాయకులు ఇద్దరే ఇద్దరని ఒకరు ఎన్టీఆర్, మరొకరు కేసీఆర్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నాడు ఎన్టీఆర్ విజయం సాధించడానికి కారణం అప్పుడు ఉన్న రాజకీయ శూన్యత, సినీ నటుడిగా ఆయనకు ఉన్న గ్లామర్ అని అభిప్రాయపడ్డారు.

బలమైన సామాజిక నేపథ్యం, ఆర్థిక వనరులు లేకున్నా కేసీఆర్ విజయం సాధించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షంపై ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందా అని ప్రతిపక్షం ఎదురుచూస్తోందని విమర్శించారు. ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలే తప్ప, అందరిముందు మాట్లాడొద్దని తమ నాయకులకు సూచించారు.  
Go Back to Shorts
Telangana
TRS
KTR
ntr
Telugudesam

More Telugu News