మహేశ్ బాబు తదుపరి సినిమా టైటిల్ గా 'సరిలేరు నీకెవ్వరూ'?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు తదుపరి సినిమా టైటిల్ గా 'సరిలేరు నీకెవ్వరూ'?

  • వచ్చేనెల 9న 'మహర్షి' విడుదల
  • అనిల్ రావిపూడితో నెక్స్ట్ మూవీ
  •  త్వరలోనే సెట్స్ పైకి
మహేశ్ బాబు తాజా చిత్రంగా 'మహర్షి' నిర్మితమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలైన తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్నాడు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుంది. కథ ప్రకారం ఈ సినిమాకి అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరూ' అనే టైటిల్ ను సెట్ చేసుకున్నాడు.

అనిల్ రావిపూడి తొలిసారిగా తన సినిమాకి పెట్టిన తెలుగు టైటిల్ ఇదే. అయితే ఈ టైటిల్ ను మహేశ్ బాబు ఓకే చేయవలసి వుంది. టైటిల్ విషయంలో మహేశ్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందనే నమ్మకంతో అనిల్ రావిపూడి వున్నాడు. మహేశ్ బాబుకి నచ్చకపోతే మాత్రం అనిల్ రావిపూడి మరో టైటిల్ ను సిద్ధం చేసుకోవలసి వస్తుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
Mahesh Babu

More Telugu News