Mayavati: మోదీపై సంచలన ఆరోపణలు చేసిన మాయావతి

షార్ట్స్‌లో చూడండి
బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ జన్మతః బీసీ కాదని, తనను తాను బీసీ వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, మోదీ బీసీ కాదన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చుకున్నారని ఆరోపించారు.

బీసీలపై ఆయనకు నిజంగా అంత ఆపేక్ష ఉంటే బీసీలు ఇంత దుస్థితిలో ఎందుకుంటారని మాయా ప్రశ్నించారు. ప్రధానికి బీసీల ఓట్ల మీదనే ప్రేమ అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గట్టిగా బుద్ధి చెబుతారని, ఆ పార్టీ అసంబద్ధ విధానాలు, విద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారని మాయావతి వ్యాఖ్యానించారు. 'చౌకీదార్' అంటూ వేసిన కొత్త ఎత్తుగడ ఎలాంటి ఫలితాన్నివ్వదని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Mayavati
Narendra Modi
BJP

More Telugu News