Andhra Pradesh: ఏపీలో రాజకీయ నేతలు బెట్టింగుల్లో మునిగిపోయారు: తులసిరెడ్డి

  • ఏపీలో కరవు విలయతాండవం చేస్తోంది
  • ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒరిగేదేమీ లేదు
  • మే 23 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి
ఏపీలో ప్రజలు కష్టాలు పడుతుంటే, రాబోయే ఎన్నికల ఫలితాలపై రాజకీయ నేతలు బెట్టింగ్ ల్లో మునిగిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో కరవు విలయతాండవం చేస్తోందని, వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, నీళ్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. టీడీపీ లేదా వైసీపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. మే 23 తర్వాత పెట్రోల్, డీజిల్ లీటర్ ధరలు రూ.100 మార్క్ దాటబోతున్నాయని అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh
Telugudesam
Ysrcp
congress
tulasi

More Telugu News