Telugudesam: ఎన్నికల సంఘం తీరుపై ఢిల్లీలో ధర్నాకు సన్నద్ధమవుతున్నాం: టీడీపీ నేత లంక దినకర్

  • ఈసీ ‘మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్’గా మారిపోయింది
  • న్యాయ వ్యవస్థనూ నిర్వీర్యం చేసే యత్నం
  • మోదీ నామినేషన్ వ్యవహారం వీడ్కోలు వేడుకలా ఉంది
ఎన్నికల సంఘం తీరుపై ఢిల్లీలో ధర్నాకు సన్నద్ధమవుతున్నామని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్.. ‘మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్’గా మారిపోయిందని, న్యాయ వ్యవస్థనూ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఇక వారణాసిలో మోదీ నామినేషన్ వ్యవహారం వీడ్కోలు వేడుకను తలపించిందని వ్యాఖ్యానించారు. వీవీ ప్యాట్లపై జాతీయ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో, చంద్రబాబు విజయం సాధించారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ పై విమర్శలు గుప్పించారు. ప్రజాసమస్యలపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
Telugudesam
Lanka Dinakar
EC
Modi
Chandrababu

More Telugu News