Mohanbabu: భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మార్కులు రాలేదని ముగించుకుంటామా?: మోహన్ బాబు ఆవేదన

  • దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
  • మీ తల్లిదండ్రులను శిక్షించవద్దు
  • విద్యార్థుల ఆత్మహత్యలపై చలించిపోయిన మోహన్ బాబు
 తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వ్యవహారంలో అనేకమంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతుండడం పట్ల సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. దేవుడు జీవితాన్ని ఇచ్చింది చివరి శ్వాస వరకు జీవించడానికే తప్ప, అర్ధంతరంగా ముగించడానికి కాదని స్పష్టం చేశారు. ఓ విద్యాసంస్థ అధిపతిగా వేల మంది విద్యార్థుల్లో మనోస్థయిర్యం కలిగిస్తున్న తనకు తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలు ఎంతో వేదన కలిగిస్తున్నాయని తెలిపారు.

'దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అలాంటి నిర్ణయాల వల్ల మీపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను శిక్షించిన వాళ్లవుతారు' అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం మార్కులు రాలేదన్న కారణంతో జీవితాన్ని అంతం చేసుకుని తల్లిదండ్రులను, బంధుమిత్రులను క్షోభ పెట్టవద్దంటూ విజ్ఞప్తి చేశారు.
Mohanbabu

More Telugu News