ఆగ్రహంలో విచక్షణ కోల్పోయిన ఉపాధ్యాయుడు.. సొంతింటికే నిప్పు!
- భార్య, పిల్లలు ఇంట్లో ఉండగానే పైశాచికత్వం
- బయటకు పరుగు తీసి తప్పించుకున్న కుటుంబ సభ్యులు
- ఇంట్లో సామానంతా కాలి బూడిద
ఇల్లు, పిల్లల్ని పట్టించుకోకుండా నారాయణ వ్యవహరిస్తుండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. భార్యతో మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన నారాయణ ఇంట్లో ఉన్న వస్త్రాలపై కిరోసిన్ పోసి వాటికి నిప్పంటించి బయటకు పారిపోయాడు. అప్పటికి ఇంట్లో భార్యతోపాటు పిల్లలు కూడా ఉన్నారు.
మంటలు బారీగా వ్యాపించడంతో వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. గ్రామస్థులు అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలడంతో మొత్తం ఫర్నీచర్, ఇతర వస్తువులు, బంగారం ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. జైనూరు పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు. నిందితుడు నారాయణ కోసం గాలిస్తున్నారు.