ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యంపై ఫిర్యాదు.. గవర్నర్ తో అఖిలపక్షం భేటీ
- గ్లోబరినా, బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలి
- ఈ ఘటనపై సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలి
- విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి: అఖిలపక్షం
గ్లోబరినా, ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఈ ఘటనపై సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలని అఖిలపక్షం కోరింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు, రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని గవర్నర్ కు మనవి చేసినట్టు సమాచారం.