తెలంగాణలో ఇంటర్ బోర్డు రగడ.. సీఎస్ జోషీతో సమావేశమైన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్!
- పలువురు ఇంటర్ విద్యార్థుల మార్కులు గోల్ మాల్
- బోర్డు ఆఫీసుల ముందు పిల్లలు, తల్లిదండ్రుల ఆందోళన
- పరిస్థితిని సీఎస్ కు వివరించిన విద్యాశాఖ కార్యదర్శి
ఇంటర్ పరీక్షల మార్కుల విషయంలో చోటుచేసుకున్న తప్పిదాలను జనార్దన్ సీఎస్ జోషీకి వివరించారు. మార్కులు తారుమారు ఎందుకయ్యాయి? మొదటి సంవత్సరం టాపర్ గా నిలిచిన విద్యార్థులకు రెండో ఏడాది ఫెయిల్ మార్కులు రావడం ఏంటి? చాలామంది విద్యార్థులకు 10 మార్కులకు మించి రాకపోవడం వంటి విషయాలను సీఎస్ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ ను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.