విద్యార్థుల ఆత్మహత్యలపై నటి పూనమ్ కౌర్ ఆవేదన

  • తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు
  • బిల్డింగ్ పై నుంచి దూకేసిన ఓ విద్యార్థి
  • ట్విట్టర్ లో స్పందించిన నటి పూనమ్ కౌర్
తెలంగాణలో ఇంటర్ ఫలితాల గోల్ మాల్ వ్యవహారంలో 17 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు  ప్రముఖులు ఈ విషయమై మాట్లాడుతున్నారు. తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ ఈ వ్యవహారంపై స్పందించారు. ‘తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.

ఓ పిల్లాడు బిల్డింగ్ పైన నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మెరిట్ విద్యార్థి అయినప్పటికీ పరీక్షల్లో ఓ మార్కుతో ఫెయిల్ కావడంతో అతను ఈ  నిర్ణయం తీసుకున్నాడట. అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గర ఇలాంటి ఘటనే జరిగింది. ఇంటర్ విద్యార్థుల భద్రతపై ఆందోళన చెందుతున్నా’ అని పూనమ్ కౌర్ ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Telangana
inter students
suicide
poonam kaur
Twitter

More Telugu News