ACB: ఏసీబీ వలలో అనంతపురం అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌-1 లక్ష్మీనారాయణ

షార్ట్స్‌లో చూడండి
అనంతపురం అర్బన్‌-1 సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈరోజు కర్నూలు డీఎస్పీ జయరామరాజ్‌, అనంతపురం డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలతో కూడిన ప్రత్యేక బృందాలు ఐదు చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి.

ఈ సోదాల్లో రూ.12 లక్షల నగదు, నాలుగు ఇళ్లు, 9 స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అనంతపురం జిల్లా కనగానపల్లికి చెందిన లక్ష్మీనారాయణ 1994లో రిజిస్ట్రార్‌ కార్యాలయంలో టైపిస్ట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 2005లో సబ్‌రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌-1గా విధులు నిర్వహిస్తున్నారు.  
Go Back to Shorts
ACB
anantapur urban
sub registrar

More Telugu News