పత్రికా స్వేచ్ఛలో నాలుగు స్థానాలు దిగువకు పడిపోయిన భారత్
- 2017వ సంవత్సరంలో 136వ స్థానం
- 2018వ సంవత్సరంలో 140వ స్థానం
- పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్ విడుదల చేసిన ఆర్‌ఎస్‌ఎఫ్
2017వ సంవత్సరంలో 136వ స్థానంలో భారత్ ఉంది. 2018లో దేశవ్యాప్తంగా ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వీరిలో గౌరీలంకేష్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. హత్య చేసిన వారంతా కేంద్రంలోని అధికార బీజేపీ మద్దతుదారులేనన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల అరాచకాలు, రాజకీయ నాయకుల వేధింపులు, మావోయిస్టుల దారుణాలు జర్నలిస్టులను ఒత్తిడికి గురి చేస్తున్నాయని, దీంతో స్వేచ్ఛగా వార్తలు రాయలేకపోతున్నారని నివేదిక పేర్కొంది.