Badla: పార్టీ కోసం కొట్టుకోవద్దు... అదేదో నేనే ఇస్తానంటూ బిగ్ బి, షారూక్ లకు తాప్సీ ఊరడింపు!

షార్ట్స్‌లో చూడండి
సూపర్ హిట్ అయిన తాజా బాలీవుడ్ చిత్రం 'బద్లా' విషయంలో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ ల మధ్య నడుస్తున్న పార్టీ వార్ కు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది తాప్సీ. అమితాబ్, తాప్సీ నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించి రూ. 100 కోట్లకు పైగా సంపాదించింది. దీనికి షారూక్ ఖాన్ నిర్మాత.

అయితే, సినిమా హిట్ అయినా చిత్ర నిర్మాతలు స్పందించలేదని, బిగ్ బీ ఇటీవల ట్వీట్ పెడితే, షారూక్ స్పందిస్తూ, మీరు పార్టీ ఎప్పుడిస్తారా అని రోజూ రాత్రిపూట మీ ఇంటి ముందే ఎదురు చూస్తున్నామని సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అమితాబ్ స్పందిస్తూ, "పార్టీ కూడా నేనే ఇవ్వాలా?" అని చమత్కరించగా, "ముంబై వచ్చాక నేనే పార్టీ ఇస్తాను. ఇకనైనా వాదులాడుకోవడం ఆపండి. పార్టీకి అందర్నీ పిలుస్తాను" అంటూ తాప్సీ తన సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించింది.
Go Back to Shorts
Badla
Big B
Amitabh Bachchan
Sharokh Khan
Tapsi

More Telugu News