నేను కెమెరా చూసి మాట్లాడుతున్నాను, నాపై నుంచి ఏదో వెళ్లినట్టు అనిపించింది: జీవీఎల్

  • తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించిన బీజేపీ నేత
  • ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగా చెప్పు విసిరిన వ్యక్తి
  • ఒకటి తగలకపోవడంతో మరోటి విసిరిన వైనం
బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తనపై జరిగిన చెప్పు దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా కాన్పూర్ కు చెందిన శక్తి భార్గవ అనే వైద్యుడు చెప్పు విసరడం సంచలనం సృష్టించింది. దీనిపై జీవీఎల్ స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"నేను కెమెరా వైపు చూసి మాట్లాడుతున్నాను. ఇంతలో నా తల పైనుంచి ఏదో వెళ్లినట్టు అనిపించింది. ఎవరో ఏదో పొరపాటున విసిరి ఉంటార్లే అనుకున్నాను. అది నాకు తగల్లేదు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే మరోసారి పైనుంచి ఏదో వెళ్లినట్టు అనిపించింది. ఈలోపు మీడియా ప్రతినిధులు, సిబ్బంది లేచి పరుగులు తీయడం, అతడ్ని పట్టుకోవడం జరిగాయి. ఒక చెప్పు తగలకపోవడంతో రెండో చెప్పు కూడా విసిరాడని ఆ తర్వాత అర్థమైంది" అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని జీవీఎల్ వివరించారు.
Go Back to Shorts
GVL
BJP

More Telugu News