Andhra Pradesh: ఈ వ్యవస్థ మారకపోతే.. ఇంకా చాలామంది నయీమ్ లు పుట్టుకొస్తారు!: సీపీఐ నేత నారాయణ హెచ్చరిక

  • ఆస్తులపైనే దర్యాప్తు చేయడం సరికాదు
  • ప్రభుత్వాలు పెంచి పోషించిన విషబిందువు నయీమ్
  • హైదరాబాద్ లో మీడియాతో సీపీఐ నేత

గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు దర్యాప్తులో తెలంగాణ ప్రభుత్వం లోతుల్లోకి వెళ్లడం లేదని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. కేవలం ఆస్తుల విషయంపై మాత్రమే దర్యాప్తు చేయడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో సరైన రీతిలో దర్యాప్తు సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఓ మీడియా ఛానల్ తో నారాయణ మాట్లాడారు.

ప్రభుత్వ విధానాల ఆధారంగా, రాజకీయ నాయకుల సాయంతో నయీమ్ దందా నడిపించాడని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను నయీమ్ యథేచ్ఛగా వాడుకున్నాడని దుయ్యబట్టారు. ఈ వ్యవస్థ మారకుంటే ఇలాంటి నయీమ్ లు చాలామంది వస్తూనే ఉంటారని హెచ్చరించారు.

నయీమ్ ను ప్రభుత్వాలు పెంచిపోషించిన ఓ విష బిందువుగా నారాయణ అభివర్ణించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపితేనే బాధ్యులకు న్యాయం జరుగుతుందన్నారు. అవసరమైతే ఈ వ్యవహారంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 

More Telugu News