ఇష్టమైన వారిని కిస్ చేస్తే, వెంటనే సెల్ఫీ కాప్చర్ చేసే గూగుల్ పిక్సెల్!

  • మధురానుభూతిని అందించే స్మార్ట్ ఫోన్
  • గూగుల్ పిక్సెల్ 3లో అందుబాటులోకి
  • నాణ్యమైన సెల్ఫీలు వస్తాయన్న సంస్థ
మీరు ఎవరికైనా ప్రేమతో ముద్దిస్తే, ఆ వెంటనే దాన్ని కాప్చర్ చేసి, మీకో మధురానుభూతిని అందిస్తుందీ సెల్ ఫోన్. ఈ అద్భుత ఫీచర్ గూగుల్ పిక్సెల్ 3లో అందుబాటులోకి వచ్చింది. భారీ డిస్ ప్లే, ట్రిపుల్ కెమెరా, ఫోల్డబుల్ ఆప్షన్ తదితర ఫీచర్లతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ కు ఆటోమేటిక్ సెల్ఫీ అదనపు ఆకర్షణని గూగుల్ తన బ్లాగ్ లో పేర్కొంది.

 పిక్సెల్ 3 వేరియంట్ కెమెరాను అప్ డేట్ చేశామని, ఫొటోబూత్ మోడ్ ను వాడి మరింత నాణ్యమైన సెల్ఫీలు దిగవచ్చని పేర్కొంది. ఇందులోని షట్టర్ ఫ్రీ బటన్, ఐదు ముఖ్యమైన ఫేస్ ఫీలింగ్స్ ను గుర్తిస్తుందని తెలిపింది. ఎక్స్ ప్రెషన్స్ ను గమనిస్తూ, సెల్ఫీలు తీస్తుందని వెల్లడించింది.
Go Back to Shorts
Google
Pixel
Selfy
Kiss

More Telugu News