Andhra Pradesh: ఏపీలోని ఓ ఈవీఎంలో అదనంగా 50 ఓట్లు.. ఎమ్మార్వోను సస్పెండ్ చేసిన ఈసీ!

షార్ట్స్‌లో చూడండి
కృష్ణా జిల్లాలో ఈవీఎంల నిర్వహణ విషయంలో అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించింది. జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. అలాగే నూజివీడు ఎమ్మార్వో తేజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. నూజివీడులోని ఓ పోలింగ్ బూత్ లో మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఆ ఓట్లను తొలగించకుండానే అధికారులు పోలింగ్ ప్రారంభించారు.

దీంతో అక్కడి ఓటర్ల సంఖ్య కంటే 50 ఓట్లు అదనంగా పడినట్లు ఈవీఎంల్లో కనిపించింది. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ, సబ్ కలెక్టర్ దినకర్ తో పాటు ఎమ్మార్వో తేజేశ్వరరావుపై చర్యలు తీసుకుంది.
Go Back to Shorts
Andhra Pradesh
Krishna District

More Telugu News