ఈవీఎంలపై దుష్ప్రచారాలను నమ్మొద్దు: రజత్ కుమార్
- పరిశీలకులు,పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ చేస్తాం
- ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరుస్తాం
- ప్రజలను ఆందోళనకు గురిచేసేలా కథనాలు వద్దు
జగిత్యాలలో ఆటోలో రవాణా చేసిన ఈవీఎంలను పోలింగ్ కోసం వినియోగించలేదని, అవగాహన కల్పించే నిమిత్తం ఈ యంత్రాలను వినియోగించినట్టు చెప్పారు. దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పార్టీల ప్రతినిధులు కూడా ఉండవచ్చని, కీసరలో ఈవీఎంలను సీల్ చేసేటప్పుడు ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో ఫొటో తీసుకున్నాడని, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసే కథనాలు ఇవ్వద్దని ఈ సందర్భంగా మీడియాకు రజత్ కుమార్ సూచించారు.