తెలంగాణలో పోలింగ్ శాతానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు వద్దు: రజత్ కుమార్
Add ap7am to your home Screen

తెలంగాణలో పోలింగ్ శాతానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు వద్దు: రజత్ కుమార్

  • పోలింగ్ రోజు సాయంత్రం చెప్పింది అప్పటి వివరాలే 
  • ఎన్ని ఓట్లు పోలైంది ఏజెంట్లకు 17సీ ఫారంలో ఇస్తాం
  • ఏమైనా అనుమానాలు ఉంటే ఆయా పార్టీలు వాటిని చూసుకోవాలి
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ రోజు సాయంత్రం చెప్పింది, అప్పటికి వచ్చిన వివరాల ఆధారంగా చెప్పామని, తుది శాతం పోలింగ్ మరుసటి రోజే వస్తుందని ముందుగానే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

పోలింగ్ పూర్తయ్యాక ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఏజెంట్లకు 17సీ ఫారంలో ఇస్తామని, ఈ విషయమై ఏమైనా అనుమానాలు ఉంటే ఆయా పార్టీలు, అభ్యర్థులు వారి ఏజెంట్ల వద్ద సరిచూసుకోవాలని సూచించారు. నిజామాబాద్ లో రాత్రి 12.02 గంటలకు పోలింగ్ బృందం రిసెప్షన్ కేంద్రానికి చేరుకుందని, మూడు, నాలుగు దశల్లో పరిశీలించాకే తుది పోలింగ్ శాతం ప్రకటిస్తామని వివరించారు. 
Telangana
EC
rajathkumar
Elections
poling

More Telugu News