సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- నితిన్ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్
- జయలలితగా బాలీవుడ్ భామ కాజోల్?
- 18 కోట్లకు 'సీత' ప్రదర్శన హక్కులు
* తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథతో ఇప్పటికే మూడు సినిమాలు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో ఇదే కథతో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరో చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో జయలలిత పాత్ర కోసం బాలీవుడ్ భామ కాజోల్ ని సంప్రదిస్తున్నట్టు సమాచారం.
* తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా రూపొందుతున్న 'సీత' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన 18 కోట్లను చెల్లించాడట.