రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి: కోమటిరెడ్డి
- దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
- కేబినెట్ లో దళితులకు, మహిళలకు స్థానం ఇవ్వలేదు
- 10 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
10 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో, ఉమ్మడి నల్లగొండలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన కళ్లు నెత్తికెక్కాయని, అందుకే, అహంకారంతో వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.