వేగంగా వెళుతూ పల్టీ కొట్టిన కారు.. ఘటనాస్థలంలోనే ఎమ్మార్వో మృతి!

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో బనగానపల్లి ఎమ్మార్వో విష్ణువర్ధన్‌రెడ్డి(48) ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గుత్తి నుంచి అనంతపురం వైపు విష్ణువర్ధన్ రెడ్డి కారులో బయలుదేరారు.

అయితే మార్గమధ్యంలో గుడ్డాలపల్లి వద్దకు రాగానే వాహనం అదుపుతప్పింది. పల్టీ కొడుతూ పక్కనే ఉన్న తోటలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో విష్ణువర్ధన్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Road Accident
Anantapur District
Kurnool District
mro
dead
Police

More Telugu News