ఎండలకు ఓటర్లు అల్లాడిపోయారు.. నిర్వహణ లోపాలపై ఈసీ సమాధానం చెప్పాలి!: సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్
- స్వాధీనం చేసుకున్న కోట్ల నగదు ఎవరిదో చెప్పాలి
- పోలింగ్ సందర్భంగా వందల ఈవీఎంలు మొరాయించాయి
- విజయవాడలో మీడియాతో సీపీఐ నేత
విజయవాడలోని సీపీఐ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయల డబ్బు ఎవరిదో ఈసీ చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు-బీఎస్పీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.