స్టూవర్టుపురం పరిసర ప్రాంతాల్లో 'టైగర్ నాగేశ్వరరావు' షూటింగ్
- బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు'
- వచ్చేనెలలో 'స్టూవర్టుపురం'లో షూటింగ్
- కథానాయికగా పాయల్ రాజ్ పుత్
ఈ చిత్రానికి 'టైగర్ నాగేశ్వరరావు' టైటిల్ ను ఖరారు చేశారు. 1980 -90 మధ్య కాలంలో 'స్టూవర్టు పురం' గజదొంగగా ఆయన ప్రజలను భయకంపితులను చేశాడు. ఆయన బయోపిక్ గా రూపొందనున్న ఈ సినిమా, అదే 'స్టూవర్టుపురం' పరిసర ప్రాంతాల్లో వచ్చేనెలలో షూటింగు జరుపుకోనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా పాయల్ రాజ్ పుత్ పేరు వినిపిస్తోంది.