ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం: కోడెల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం: కోడెల

  • ఎన్నికల నిర్వహణలో విఫలమైన ఈసీ సిగ్గుపడాలి
  • ఇనిమెట్లలో వైసీపీ నేతలు రెచ్చగొట్టి దౌర్జన్యం చేశారు
  • కేంద్ర బలగాలు ఇవ్వకుండా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు
ఏపీలో ఎన్నికల నిర్వహణలో విఫలమైనందుకు ఈసీ సిగ్గుపడాలని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బలగాలు ఇవ్వకుండా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. నిన్న పోలింగ్ బూత్ లో కేవలం ఒక హోంగార్డు మాత్రమే ఉండటం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఇనిమెట్లలో వైసీపీ నేతలు రెచ్చగొట్టి దౌర్జన్యం చేశారని, ఇంత వరకూ ఎవరూ తన ఎదురుగా వచ్చి చెయ్యెత్తిన పరిస్థితి లేదని అన్నారు. బాసు లింగారెడ్డి, అంబటి, రాజనారాయణలపై కేసులు పెట్టాలని ఈ సందర్భంగా కోడెల డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
kodela
siva prasad

More Telugu News