ఏఆర్ రెహ్మాన్ నిర్మాతగా '99 సాంగ్స్' మూవీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏఆర్ రెహ్మాన్ నిర్మాతగా '99 సాంగ్స్' మూవీ

  • నిర్మాణ రంగంలోకి ఏఆర్ రెహ్మాన్ 
  • సంగీతం ప్రధానంగా సాగే సినిమా
  •  ఈ ఏడాది జూన్ 21న విడుదల    
సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ అసమానమైన ప్రతిభా పాటవాలను కనబరుస్తూ వస్తున్నారు. సంగీత ప్రపంచానికి తనవైన బాణీలను పరిచయం చేసిన ఆయన, తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తన అభిరుచికి తగినట్టుగా సంగీతం నేపథ్యంతో కూడిన సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి '99 సాంగ్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఒక స్ట్రగులింగ్ సింగర్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందింది.

విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ ఏడాది జూన్ 21వ తేదీన తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఎహాన్ భాట్ .. ఎడిల్సి వెరగాస్ .. మనీషా కొయిరాలా .. లీసారే .. థామస్ ఆండ్ర్యూస్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు. సంగీతమే ప్రధానంగా .. సంగీతమే ప్రధాన కథావస్తువుగా రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
rehman

More Telugu News