‘బాలాకోట్ విజేతలను ఎన్నుకోండి’ అన్న మోదీ మాటపై ఈసీ ఆరా
- లాతూర్ సభలో దాడుల అంశంపై మాట్లాడిన ప్రధాని
- ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్న విపక్షాలు
- నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులను ఆదేశించిన ఈసీ
ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన ఈసీ స్థానిక అధికారులను నివేదిక కోరింది. ప్రధాని ప్రసంగం వీడియో తెప్పించుకున్నామని, దాన్ని పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్ అధికారి చంద్రభూషణ్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై జిల్లా అధికారి ఇచ్చిన వివరణను మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేమని స్పష్టం చేశారు.