Andhra Pradesh: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
అనంతపురం జిల్లాలోని  తనకల్లు, నల్లచెర్వు మండలాల సమీపంలోని 42వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుక్కంటి క్రాస్ నుంచి ప్రయాణికులతో కదిరి వెళ్తున్న మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండ్లపల్లి క్రాస్‌ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఎనిమిది మందిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం కారణంగానే ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Anantapur District
Road Accident
mini bus

More Telugu News