Shahrukh Khan: షారుక్ ఖాన్ వాటాగా 200 కోట్లు?

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ సినిమా సక్సెస్ రేటును పెంచిన బాద్షాగా షారుక్ ఖాన్ గురించి చెబుతారు. ఇటీవల వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. థియేటర్స్ లో ఆయన సినిమాలు చేసే సందడి అటుంచితే, టీవీల్లో వచ్చే ఆయన పాత సినిమాలకి మంచి రేటింగ్స్ వస్తుంటాయి. అందువలన ఆయన పాత సినిమాల శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి కొన్ని టీవీ చానల్స్ పోటీపడ్డాయి.

అలా ఆయన నటించిన 22 సినిమాల శాటిలైట్ హక్కులను ఒక టీవీ ఛానల్ వారు ఒకేసారిగా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్ని సినిమాలకి ఒకేసారి శాటిలైట్ డీల్ జరగడం .. అది భారీస్థాయి రేటుకు జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. షారుక్ ఖాన్ కొన్ని సినిమాలకి లాభాల్లో వాటానే పారితోషికంగా తీసుకుంటారు. మరికొన్ని సినిమాలకి నిర్మాణంలో భాగస్వామిగా వుంటారు. అందువలన ఈ 22 సినిమాల శాటిలైట్ డీల్ ద్వారా షారుక్ ఖాన్ కి దక్కిన మొత్తం వాటా 200 కోట్లు అనేది బాలీవుడ్ టాక్. 
Go Back to Shorts
Shahrukh Khan

More Telugu News