Andhra Pradesh: హిందూపురంలో ఓపికగా క్యూలైన్ లో నిలబడి ఓటేసిన బాలకృష్ణ!

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య వసుంధరతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన బాలయ్య ఓటేశారు. తెలుపు రంగు దుస్తుల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన బాలకృష్ణ ఓపిగ్గా క్యూలైన్ లో నిలుచుకున్నారు.

అనంతరం తమ వంతు రాగానే పోలింగ్ ఆఫీసర్ కు ఐడీ కార్డును చూపించి ఓటేశారు. అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లకోసారి మాత్రమే ఓటేసే అవకాశం వస్తుందని బాలకృష్ణ తెలిపారు. హిందూపురంలో ఓటు హక్కును వినియోగించుకోవడం సొంత ఊర్లో వినియోగించుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Anantapur District
hindupur
Balakrishna
vote caste

More Telugu News