బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ పిటిషన్!
- ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపణలు
- హైకోర్టులో పిటిషన్ వేసిన తలసాని ఎన్నికల ఏజెంట్
- కిషన్ రెడ్డి, అమిత్ షా, లక్ష్మణ్ పై చర్యలకు వినతి
ఓటరు స్లిప్పులతో పాటు బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డిపై ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కిషన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అదే విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పైనా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనున్నట్టు సమాచారం.