నిజామాబాద్ లోని పోలింగ్ కేంద్రాల ముందు అభ్యర్థుల ఫొటోలు, గుర్తులతో ఛార్ట్!
Add ap7am to your home Screen

నిజామాబాద్ లోని పోలింగ్ కేంద్రాల ముందు అభ్యర్థుల ఫొటోలు, గుర్తులతో ఛార్ట్!

  • నిజామాబాద్  నుంచి 185 మంది అభ్యర్థుల పోటీ
  • విధుల్లో పాల్గొననున్న 12 వేల మంది సిబ్బంది
  • 26 వేల బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం: కలెక్టర్
నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో 185 మంది అభ్యర్థులు పోటీకి దిగిన విషయం తెలిసిందే. అక్కడి పోలింగ్ కేంద్రాల ముందు అభ్యర్థుల ఫొటోలు, గుర్తులతో కూడిన చార్ట్ లను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 700 మంది మైక్రో అబ్జర్వర్లతో కలిపి 12 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గం మొత్తం 26 వేల బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నామని, ప్రతి 5 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టార్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.
Telangana
Nizamabad District
Elections
collector

More Telugu News