'నిన్ను హీరోగా పెట్టి సినిమా తీసేదెవరు'? అని నన్ను మా ఆవిడే అడిగింది: సంపూర్ణేశ్ బాబు
- మా ఊళ్లో సొంత ఇల్లు వుంది
- షాపు అద్దె నెలకి రెండు వేలు
- సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుండేవాడిని
షాపుకి వెళ్లడం .. పని చూసుకుని ఇంటికి రావడం ఇది నా దినచర్య. అప్పుడప్పుడు మాత్రం జేబులో ఓ అయిదు వందలు పెట్టుకుని హైదరాబాద్ వచ్చేవాడిని. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి .. తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్నాయనగా మా ఊరుకి వెళ్లిపోయేవాడిని. అలా మొత్తానికి ఒక సినిమా లైన్లోకి వచ్చింది. అప్పుడు మా ఆవిడకి చెప్పాను .. 'ఒకతను నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని అన్నాడు' అని. మా ఆవిడ ఆశ్చర్యపోతూ .. 'నిన్ను హీరోగా పెట్టి సినిమా తీసేదెవరు'? అని అడిగింది" అంటూ నవ్వేశాడు.