Sharmila: సింహం సింగిల్ గానే వస్తుంది: వైఎస్ షర్మిల

షార్ట్స్‌లో చూడండి
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తోందని, బీజేపీతో, టీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకున్నట్టు తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. పొత్తుల కోసం నిత్యమూ వెంపర్లాడేది చంద్రబాబేనని అన్నారు. జగన్ సింహం వంటివాడని, సింహం సింగిల్ గానే వస్తుందని, నక్కలే గుంపులుగా వస్తాయని తనదైన శైలిలో వ్యాఖ్యానించి, సభకు వచ్చిన కార్యకర్తలు, అభిమానుల్లో షర్మిల ఉత్సాహం నింపారు.

 చంద్రబాబు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జనసేనలను తోడు తెచ్చుకున్నారని ఆరోపించిన ఆమె, అన్ని జాతీయ మీడియా సంస్థల సర్వేలూ వైసీపీదే అధికారమని చెబుతున్నాయని అన్నారు. గెలుస్తామన్న నమ్మకం లేకనే కేజ్రీవాల్, మమతా బెనర్జీ, దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లా తదితర ప్రాంతీయ పార్టీల నేతలను ఆయన ప్రచారానికి పిలుచుకు వచ్చారని, అయినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని అన్నారు.
Go Back to Shorts
Sharmila
Jagan
Chandrababu

More Telugu News