ఏపీలో నేడు అధినేతల చివరి ప్రచారం.. ఎవరెవరు ఎక్కడ ముగిస్తారంటే..!
- కర్నూలు రోడ్డు షోతో ముగియనున్న జగన్ ప్రచారం
- పాలకొల్లు, భీమవరం, నరసాపురంలలో పవన్
- గురజాల, సత్తెనపల్లి, తాడికొండలలో చంద్రబాబు ప్రచారం
డోన్, ఆళ్లగడ్డలలో వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విజయవాడ వెస్ట్, మైలవరంలలో జగన్ సోదరి షర్మిల ప్రచారంలో పాల్గొంటారు. జగ్గయ్యపేట సభతో షర్మిల ప్రచారం ముగియనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11:45 గంటలకు గురజాలలో జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 3:15 గంటలకు తాడికొండ బహిరంగ సభలో టీడీపీ అధినేత పాల్గొని ప్రసంగిస్తారు.