Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఆఫ్రికా దేశంలో '96' రీమేక్ షూటింగ్ 
  • హీరోగా ప్రముఖ నిర్మాత తనయుడు 
  • పోస్ట్ ప్రొడక్షన్ దశలో శర్వానంద్ సినిమా

*  తమిళంలో హిట్టయిన '96' చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. శర్వానంద్, సమంత జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ఈ నెలలో ఆఫ్రికా దేశం కెన్యాలో జరుగుతుంది. పదిహేను రోజుల పాటు అక్కడ షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
*  గతంలో పలు చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రం సహదేవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ కుర్రాడు హీరోగా నటించిన 'ఎవడూ తక్కువ కాదు' చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. రఘు జయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక జైన్ హీరోయిన్ గా నటించింది.
*  శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. మే 31న విడుదల కానున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్లుగా నటించారు.

More Telugu News