కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారు.. ఆయనకు ఓటెయ్యొద్దు: వివేక్ సోషల్ మీడియా సందేశం
- ఇటీవల టీఆర్ఎస్‌ను వీడిన పెద్దపల్లి మాజీ ఎంపీ
- ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు
- కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ నియోజకవర్గ ప్రజలకు పిలుపు
వివేక్ గత రెండు రోజులుగా హైదరాబాద్‌లోని తన నివాసంలో అనుచరులతో సమావేశం అవుతున్నారు. వివేక్ తాజా పిలుపుతో ఆయన అనుచరులు పెద్దపల్లి నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. కాగా, టీఆర్ఎస్‌ను వీడిన వివేక్‌తో ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతోపాటు ఏఐసీసీ నేతలు కూడా టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.