Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  కథానాయిక నయనతార తొలిసారిగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించనుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో కీలక పాత్రకు నయనతారను తీసుకున్నట్టు తాజా సమాచారం .
*  రవితేజ నటించే 'కనకదుర్గ' చిత్రం షూటింగును ఈ నెల మూడో వారం నుంచి నిర్వహిస్తారు. తమిళ చిత్రం 'తేరి'కి రీమేక్ గా రూపొందే ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు.  
*  ప్రస్తుతం 'తుగ్లక్' చిత్రంలో నటిస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ దీని తర్వాత విరించి వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇది పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోంది.
*  పలు తెలుగు సినిమాలలో నటించిన అందాలతార ప్రణీత ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. అజయ్ దేవగణ్, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్న 'భుజ్' చిత్రంలో ప్రణీత కీలక పాత్రకు ఎంపికైంది. 
Go Back to Shorts
Nayanatara
Maniratnam
Raviteja
kalyan Ram

More Telugu News