తాను మాట్లాడుతుంటే వీధి లైట్లు ఆగిపోవడం పట్ల పవన్ కల్యాణ్ అసహనం
Add ap7am to your home Screen

తాను మాట్లాడుతుంటే వీధి లైట్లు ఆగిపోవడం పట్ల పవన్ కల్యాణ్ అసహనం

  • పెందుర్తిలో ఘటన
  • సభ సక్సెస్ కావడం చూడలేకపోయారు
  • కావాలనే చేశారంటూ జనసేనాని ఆరోపణ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం ఎదురైంది. విశాఖ జిల్లా పెందుర్తిలో పవన్ సభ జరుగుతుండగా ఉన్నట్టుండి వీధి లైట్లు ఆగిపోయాయి. దాంతో పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసేన సభ విజయవంతం కావడం చూసి ఓర్వలేకే వీధి లైట్లు తీసేశారని మండిపడ్డారు. ఇది అధికార పార్టీ నేతల నిర్వాకమేనని ఆరోపించారు. రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పెత్తనం నడుస్తోందని విమర్శించారు. స్థానికంగా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, అతని తనయుడు భూకబ్జాలకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఆరోపించారు.
Pawan Kalyan
Jana Sena

More Telugu News