ప్రోగ్రామ్ నిమిత్తం బస్సెక్కిన డ్యాన్సర్... మాయమాటలు చెప్పి గ్యాంగ్ రేప్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రోగ్రామ్ నిమిత్తం బస్సెక్కిన డ్యాన్సర్... మాయమాటలు చెప్పి గ్యాంగ్ రేప్!

  • ఢిల్లీలో డ్యాన్స్ ప్రోగ్రామ్ కు బయలుదేరిన డ్యాన్సర్
  • ముందే తెలుసుకుని ముగ్గురు యువకుల ప్లాన్
  • ముగ్గురినీ అరెస్ట్ చేశామన్న పోలీసులు
ఓ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకుని, అక్కడికి వెళ్లేందుకు బస్సెక్కిన ఓ యువతిని, ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన హర్యానాలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఢిల్లీలోని కజౌరీ ఖాస్ లో ఓ నృత్య కార్యక్రమం చేసేందుకు హర్యానాకు చెందిన డ్యాన్సర్ (20) అంగీకరించింది. బస్సులో ఆమె ఢిల్లీకి బయలుదేరగా, అప్పటికే, ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు తాము ఈవెంట్ వద్దకే వెళుతున్నామని, తీసుకెళతామని నమ్మబలికారు. వారి మాటలను ఆమె నమ్మగా, కశ్మీరీ గేట్ వద్ద ఆమెను దించి, ఆపై బవానా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె సెల్ ఫోన్ తీసుకుని నిందితులు పారిపోగా, పోలీసు కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి, అరెస్ట్ చేశామని తెలిపారు.
Gang Rape
Police
Dancer
Dance
Haryana

More Telugu News