Tamil Nadu: తమిళనాడులో.. ఎన్నికల అధికారులకు పట్టుబడ్డ 146 కేజీల బంగారం

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల వేళ దొంగచాటుగా పెద్దమొత్తంలో నగదు తరలించడం, ఇటువంటి నోట్లకట్టలు అప్పుడప్పుడూ అధికారులకు చిక్కడం సర్వసాధారణం. కానీ తమిళనాడులో ఓ వ్యాన్‌ నుంచి పెద్ద ఎత్తున బంగారం కడ్డీలు చిక్కడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు సమీపంలోని పులియాకుళం ప్రాంతంలో ఎన్నికల అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ వ్యాన్‌ని నిలువరించి సోదాలు చేయగా పెద్దమొత్తంలో బంగారం కడ్డీలు ఉన్నట్టు గుర్తించారు. బయటకు తీస్తే ఏకంగా 146 కిలోల బంగారం ఉండడంతో ఆశ్చర్యపోయారు. వ్యాన్‌ సిబ్బందిని ప్రశ్నించగా ఓ ప్రముఖ బంగారం దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకువెళ్తున్నామని వారు చెప్పినా, అందుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడంతో నగలను, వ్యాన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమయింది.
Go Back to Shorts
Tamil Nadu
gold seized
koyambathuru
EC

More Telugu News